Telugu Gateway
Politics

‘ప్రజావేదిక’ కూల్చివేతకు జగన్ ఆదేశం

‘ప్రజావేదిక’ కూల్చివేతకు జగన్ ఆదేశం
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ‘ప్రజావేదిక’ను కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రితో సహా..మంత్రులు..ఉన్నతాధికారులు..కలెక్టర్లు ఇప్పుడు అంతా ఓ అక్రమ, అవినీతితో కట్టిన భనవంలో కూర్చున్నామని అన్నారు. కలెక్టర్ల సమావేశం ప్రజావేదికలోనే పెట్టిన ఉద్దేశం కూడా..అసలు అందరికీ దీన్ని చూపిద్దామనే అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వమే ఇలా అక్రమ నిర్మాణాలు చేపడితే ఎవరు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అదే ఎవరైనా సామాన్యుడు..గొంతుకలేని వ్యక్తి చేస్తే అధికారులు ఏమి చేస్తారని ప్రశ్నించారు.

ఓ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి అక్రమ నిర్మాణాలు కడితే.. కింద ఉన్న వాళ్ళు అక్రమాలు చేయకుండా ఉంటారా? దీనిని చూస్తేనే.. కిందిస్థాయిలో అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మంగళవారం ఎస్పీల మీటింగ్ పూర్తయ్యాక.. ఎల్లుండి.. అక్రమ కట్టడమైన ప్రజా వేదిక కూల్చివేత నుంచే ప్రక్షాళన మొదలు పెడదాం. ఈ బిల్డింగ్ లో ఇదే చివరి సమావేశం అని జగన్ తెలిపారు. వారం రోజుల గడువు ఇఛ్చి టెండర్ ను పిలిచారని..ఐదు కోట్లతో పనులు మొదలుపెట్టి..దీన్ని ఎనిమిది కోట్లకు పెంచారని విమర్శించారు.

Next Story
Share it