Telugu Gateway
Politics

జ‌గ‌న్ డైన‌మిక్ సీఎం

జ‌గ‌న్ డైన‌మిక్ సీఎం
X

స‌హ‌జంగా సీపీఐ నారాయణ అంటే విమ‌ర్శ‌ల స్పెష‌లిస్ట్. ముందు ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌టం త‌ర్వాత నింపాదిగా సారీ చెప్ప‌టం అల‌వాటు. అలా కాకపోయినా నారాయ‌ణ విమ‌ర్శ‌ల‌కు ఓ స్టైల్ ఉంటుంది. అందులో ఆయ‌న‌ది ఓ ప్ర‌త్యేక శైలి. అలాంటి సీపీఐ నారాయ‌ణ ఏపీ నూత‌న సీఎంజ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని మాత్రం పొగిడారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తక్కువ సమయంలో ఎక్కువ మంచి పనులు చేస్తున్నారని నారాయణ పేర్కొన్నారు. తద్వారా డైనమిక్‌ సీఎం అనిపించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృతి విద్యాపీఠ్‌ అధ్యాపకుల నియామకంలో రిజర్వేషన్లు పాటించడం లేదని నారాయణ ఆరోపించారు. ఈ మేరకు యూజీసీ చైర్మన్‌ డీపీ సింగ్‌ను కలిసి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రిజర్వేషన్ల అంశమై యూజీసీ చైర్మన్‌ సరైన నిర్ణయం తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.

Next Story
Share it