Telugu Gateway
Politics

విలీనంపై హైకోర్టుకు కాంగ్రెస్

విలీనంపై హైకోర్టుకు కాంగ్రెస్
X

అధికార టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనంపై శుక్రవారం నాడు హైకోర్టును ఆశ్రయించనున్నట్లు టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దళితుడైన మల్లు భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేతగా ఉండటం సీఎం కెసీఆర్ కు ఏ మాత్రం సహించటంలేదన్నారు. గురువారం నాడు జరిగిన ఘటన కాంగ్రెస్ పార్టీకి జరిగిన నష్టంగా చూడొద్దు. తెలంగాణ సమాజానికి జరిగిన నష్టంగా మీడియా చూపించాలి అని విజ్ఞప్తి చేస్తున్నా అని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. సమాజం నాశనం అయినా సరే మేము మాత్రమే బాగుండాలి అని కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. 2014 లో టీడీపీ ని సీపీఎం పార్టీల నేతలను టీఆరెస్ లో కలుపుకున్నారు. 2018 నుండి కాంగ్రెస్ నేతలను టీఆరెస్ నేతలు ప్రలోభ పెడుతున్నారు. స్పీకర్ కు రాజ్యాంగం అత్యున్నత స్తానం కట్టబెట్టింది. కానీ స్పీకర్ ఈ రోజు వ్యవహరించిన తీరు గర్హనీయం. పార్టీ మారబోతున్నాం అని చెప్పిన ఎమ్మెల్యేలపైన చర్య తీసుకోమని స్పీకర్ ను ఇంతకు ముందే కోరాం. ఎమ్మెల్యే అనర్హత పిటీషన్ స్పీకర్ దగ్గర ఉంది అయినా సిఎల్పీని విలీనం ఎలా చేస్తారు. కాంగ్రెస్ దయతో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ అధికార దుర్వినియోగం చేస్తున్నాడు. పైలెట్ రోహిత్ రెడ్డి పార్టీ మారకుంటే క్రిమినల్ కేసులు పెడతాం అని బెదిరించారు. కేసీఆర్ బంధువు నవీన్ రావు తనను బయపెట్టాడు అని పైలెట్ రోహిత్ రెడ్డి నాకు చెప్పాడు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలను అక్కడి నియోజక వర్గ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. 8వతారీకు న బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నా కార్యక్రమం ఉంటుంది. ఇలాంటి అణిచివేసే ప్రక్రియ తో కాంగ్రెస్ పార్టీ బలహీన పడకుండా మరింత బలపడేలా ఉద్యమం చేపడతాం. 88 మంది ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ గెలిచినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉండకూడదు అని ఎందుకు ప్రయత్నం జరుగుతుంది. మీరు చేసే అవినీతిని ఎవరూ ప్రశ్నించకుండా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారా....లేదంటే నీ కొడుకు కేటీఆర్ కు నీ అల్లుడు హరీష్ రావుకు గోడవైతే హరీష్ కు ఏ ఎమ్మెల్యే కూడా మద్దతు ఇవ్వకూడదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆరెస్ లో చేర్చుకుంటున్నారా అని ప్రశ్నించారు ఉత్తమ్. కెసీఆర్ చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పు అని మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. దీనిపైనే ప్రజలు ఆలోచించాలని కోరుతున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న ఈ వికృత చర్యలను గమనించాలి. రాష్ట్రాన్ని అప్పుల పావులు చేసి ,ప్రాజెక్టుల రీ డిజైన్ పేరిట వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు.

Next Story
Share it