కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వేటు!
BY Telugu Gateway24 Jun 2019 4:44 AM GMT

X
Telugu Gateway24 Jun 2019 4:44 AM GMT
కాంగ్రెస్ అధిష్టానంపై ధిక్కార స్వరం విన్పిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వేటు పడటం ఖాయంగా కన్పిస్తోంది. క్రమశిక్షణా కమిటీ నోటీసులను కూడా ఆయన లైట్ తీసుకున్నట్లే కన్పిస్తోంది. ఈ వ్యవహారంపై అధిష్టానం ఆగ్రహంగా ఉంది. సస్పెండ్ చేస్తే ఫిరాయింపునకు మార్గం క్లియర్ చేసినట్లు అవుతుందా? అన్న కోణంలోనూ ఆలోచిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి చర్యలకు అవకాశం ఉంది అనే అంశంపై వివిధ కోణాల్లో చర్చిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యాణ్మాయం బీజేపీనే. తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకత్వంలో లోపం ఉంది. నేతలందరూ బీజేపీ వైపే చూస్తున్నారు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.త్వరలోనే ఆయన బిజెపిలోకి చేరటం ఖాయంగా కన్పిస్తోంది.
Next Story