కాంగ్రెస్ కీలక నిర్ణయం
BY Telugu Gateway15 Jun 2019 12:05 PM GMT

X
Telugu Gateway15 Jun 2019 12:05 PM GMT
కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరితో పొత్తు లేకుండా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయం మేరకు సొంతంగానే బలపడాలని..పొత్తులకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింథియాలు ఉత్తరప్రదేశ్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లు తెలిపారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలకు సంబంధించి త్వరలో మరోసారి సమావేశం నిర్వహించి అభ్యర్ధులను ఖరారు చేయాలని నిర్ణయించుకున్నారు.
Next Story