విదేశీ పర్యటనకు చంద్రబాబు
BY Telugu Gateway19 Jun 2019 9:46 AM IST
X
Telugu Gateway19 Jun 2019 9:46 AM IST
తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళ్ళారు. బుధవారం తెల్లవారుజామున ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఐరోపా దేశాల పర్యటనకు వెళ్ళినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఆయన విదేశీ పర్యటన ఈ నెల ప్రారంభంలోనే తలపెట్టినా అసెంబ్లీ సమావేశాల కారణంగా వాయిదా వేసుకున్నారు.ఐదు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలు మంగళవారం తో నిరవధికంగా వాయిదా పడ్డాయి.
ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం తర్వాత విశ్రాంతి కోసం ఆయన ఈ పర్యటన పెట్టుకున్నారు. ఈ నెల 24న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని చెబుతున్నారు. వాస్తవానికి అన్ని పార్టీల అధినేతలతో బుధవారం నాడు ఢిల్లీలో ప్రధాని మోడీ సమావేశం తలపెట్టారు. దీనికి చంద్రబాబు హాజరుకాకుండా..పార్టీ అభిప్రాయాలను లేఖ ద్వారా తెలియజేయాలని నిర్ణయించుకున్నారు.
Next Story