విమానాశ్రయంలో చంద్రబాబుకు తనిఖీలు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు గన్నవరం విమానాశ్రయంలో విచిత్ర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆయన గన్నవరం విమానాశ్రయంలో పోలీసుల తనిఖీల అనంతరం విమానాశ్రయంలోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. భద్రతా సిబ్బంది చంద్రబాబు వాహనాన్ని విమానాశ్రయం లోనికి అనుమతించకపోవటంతో ఈ పరిస్థితి ఎదురైంది. ఇతర ప్రయాణికుల మాదిరే చంద్రబాబుకు తనిఖీలు చేసిన భద్రతా సిబ్బంది లోనికి అనుమతించారు.
విమానాశ్రయం లాంజ్ నుండి విమానం వరకు ప్రయాణికుల బస్ లొనే చంద్రబాబు ప్రయాణం చేశారు. వీఐపీ, జెడ్ ప్లస్ భద్రత లో ఉన్నా చంద్రబాబు కు ప్రత్యేక వాహనం అధికారులు కేటాయించలేదని టీడీపీ విమర్శిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ను చంద్రబాబు కాన్వాయ్ కి పైలెట్ క్లియరెన్స్ తొలగింపు ట్రాఫిక్ లో చంద్రబాబు వాహనo ఆగితే భద్రత పరంగా శ్రేయస్సు కాదని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.