Telugu Gateway
Cinema

‘బుర్రకథ’ ట్రైలర్ విడుదల

‘బుర్రకథ’ ట్రైలర్ విడుదల
X

‘రామాయణంలో రాముడి శత్రువు రావణాసురుడు. కృష్ణుడి శత్రువు కంసుడు. మరి నా శత్రువు ..నాతోనే ఉన్నాడు. ’ అంటూ ఆది చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. వీడు అభి నా..రామా? అంటూ రాజేంద్రప్రసాద్ అనుమానపు చూపులు చూస్తుంటాడు. ఒకే బుర్రలో రెండు రకాల ఆలోచనలు ఉంటే ఎలా ఉంటుందో చెప్పే సినిమానే ఈ బుర్రకథ అనే విషయం ట్రైలర్ తో తెలిసిపోయింది. పాతికేళ్ళ వయస్సులో సన్నిలియోన్ కావాలని అడగాలి కానీ...సన్యాసి అవుతానంటావేంటి అంటూ జబర్దస్త్ చమ్మక్ చంద్ర చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. టీజర్ తోనే ఈ సినిమాలో ఏదో ఉంది అని చెప్పకనే చెప్పేశారు చిత్ర యూనిట్. సోమవారం నాడు చిత్ర బృందం సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ బుర్రకథ సినిమా జూన్ 28నే ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

ఒకే మనిషిలో రెండు బుర్రలు, రెండూ వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉండటం, వాటి వల్ల క్రియేట్‌ అయ్యే ఫన్‌, వచ్చే కష్టాలు ఇలా అన్నింటిని టచ్‌ చేస్తూ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా మలిచినట్లు కన్పిస్తోంది. ట్రైలర్‌ ఎండింగ్‌లో కమెడియన్‌ పృథ్వీ డైలాగ్స్‌ ఆకట్టుకున్నాయి. ఇటీవలె సాహో టీజర్‌ను కాపీ కొడుతూ పృథ్వీ చేసిన కామెడీ హైలెట్‌గా నిలిచింది. దీపాల ఆర్ట్స్‌ బ్యానర్‌పై హెచ్‌.కె. దీపాల నిర్మిస్తున్న చిత్రంలో మిస్తీ చక్రవర్తి, నైరాషాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మాటల రచయిత డైమండ్‌ రత్నబాబు మొదటిసారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

https://www.youtube.com/watch?time_continue=5&v=7B6Syq2wxlM

Next Story
Share it