యార్లగడ్డ నన్ను బెదిరించారు
BY Telugu Gateway21 Jun 2019 6:08 PM IST

X
Telugu Gateway21 Jun 2019 6:08 PM IST
తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుల ఫిరాయింపు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎంపీలపై విమర్శలు చేసినందుకు తనను మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ బెదిరించారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఇలా మాట్లాడితే ఎంపీలు కేసు పెట్టి బోల్టులు బిగిస్తారని బెదిరించారని..గతంలో ఎప్పుడూ ఏ పార్టీ నేతలూ తనను ఇలా బెదిరించలేదన్నారు. ఈ అంశంపై శనివారం నాడు డీజీపీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
పార్టీ మారిన 24 గంటల్లోనే ఇలా బెదిరింపులకు దిగటం ఏంటని..సుజనా చౌదరి ఇంటి నుంచే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఫోన్ చేశారని ఆరోపించారు. తానేమీ ఇలాంటి ఉడత ఊపులకు భయపడనని..తాను బ్యాంకులను మోసం చేయలేదని..అక్రమాలు చేయలేదని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం సాయంత్రం విజయవాడలో విలేకరుల సమావేశం పెట్టి ఈ ఆరోపణలు చేశారు.
Next Story



