ప్రొటెం స్పీకర్ గా శంబంగి
BY Telugu Gateway8 Jun 2019 12:16 PM IST

X
Telugu Gateway8 Jun 2019 12:16 PM IST
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నూతన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించే అవకాశం సీనియర్ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడికి దక్కింది. ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేసిన ఆయనతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేయించారు. శంబంగి విజయనగరం జిల్లా బొబ్బిలి శాసనసభా నియోజకవర్గం నుంచి ఇప్పటికి 4సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికల్లో ఆయన సుజయ్‌కృష్ణ రంగారావును ఓడించారు. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన శంబంగి శాసనసభ సమావేశాల తొలి రోజున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తరువాత శాసనసభ స్పీకర్ ఎన్నికను కూడా నిర్వహించాల్సి ఉంటుంది. కొత్తగా ఎన్నికైన స్పీకర్‌కు పదవీ బాధ్యతలు అప్పగించిన తరువాత ఆయన పదవీకాలం ముగుస్తుంది.
Next Story



