Telugu Gateway
Politics

టీటీడీ బోర్డుతో పాటు పాలక మండళ్ళ రద్దు!

టీటీడీ బోర్డుతో పాటు పాలక మండళ్ళ రద్దు!
X

అత్యంత ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)తోపాటు గత ప్రభుత్వం నియమించిన పాలక మండళ్ళను రద్దు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. టీటీడీ ఛైర్మన్ గా సుధాకర్ యాదవ్ తాను టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకునే ప్రశ్నేలేదని..ప్రభుత్వం తొలగిస్తేనే వెళ్ళిపోతామని బహిరంగంగానే ప్రకటించారు. గతంలో ప్రభుత్వాలు మారినప్పుడు అప్పటి ప్రభుత్వం నియమించిన వారిలో చాలా మంది తమ పదవులు వదులుకుని వెళ్లిపోయేవారు. కానీ కొంత మంది మాత్రం వాటిని పట్టుకుని వేలాడుతున్నారు. దీంతో ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగి ఆర్డినెన్స్ లేదా శాసనసభలో బిల్లు పెట్టి పాత కమిటీలను రద్దు చేయాల్సి వస్తోంది.

ఇప్పుడు ఏపీలో జగన్ ప్రభుత్వం కూడా ఇదే దిశగా సాగుతున్నట్లు సమాచారం. కొత్త ప్రభుత్వం కొలువుదీరటంతో తమ పార్టీకి చెందిన, తమకు కావాల్సిన వాళ్లను నియమించుకోవటం కోసం ప్రయత్నించటం సహజం. ఇఫ్పుడు ఏపీ సర్కారు ఆర్డినెన్స్ తీసుకురావటం ద్వారా పాత పాలక మండళ్లను ఇంటికి పంపుతుందా? లేక నేరుగా అసెంబ్లీలోనే బిల్లు పెడతారా? అన్నది మాత్రమే తేలాల్సి ఉంది. మరో వారం, పది రోజుల్లోనే ఈ వ్యవహారం అంతా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

Next Story
Share it