Top
Telugu Gateway

ఏపీ మంత్రులంతా కోటీశ్వరులే..జగనే చాలా రిచ్

ఏపీ మంత్రులంతా కోటీశ్వరులే..జగనే చాలా రిచ్
X

ఏపీ మంత్రివర్గంలో అత్యంత సంపన్నుడు సీఎం జగన్మోహన్ రెడ్డే. ఆయన ఆస్తి 510 కోట్ల రూపాయలు. అంతే కాదు..ఏపీ మంత్రివర్గంలో ఉన్న వారంతా కోటీశ్వరులే. ఈ విషయాన్ని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) బహిర్గతం చేసింది. ఈ మేరకు మంత్రులకు సంబంధించిన ఆస్తుల వివరాలతో ఓ ప్రకటన విడుదల చేసింది. జగన్ తర్వాత అత్యంత సంపన్నుల జాబితాలో పెద్ది రెడ్డి రామచంద్రరెడ్డి ఉన్నారు.

ఆయన ఆస్తి 130 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. మేకపాటి గౌతంరెడ్డి 61 కోట్లుగా పేర్కొన్నారు. మొత్తం కేబినెట్ లోని 26 మందిలో 88 శాతం మంత్రి కోటీశ్వరులే అని తెలిపారు. మంత్రుల సగటు ఆస్తి 35.25 కోట్ల రూపాయలుగా ఏడీఆర్ వెల్లడించింది. ఇందులో మరో విశేషం కూడా ఉంది. అందరి కంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 20 కోట్ల రూపాయల రుణం కూడా ఉందని తెలిపారు.

Next Story
Share it