జగన్ మరో సంచలన నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు దూకుడుగా ఉంటున్నాయి. అమ్మ ఒడి పథకం అమలుకు ఎంత వ్యయం అవుతుంది?. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ స్కూళ్ళలో చదివే పేద విద్యార్ధులకు ఇచ్చేందుకు బడ్జెట్ సహకరిస్తుందా? అన్న అంశంపై ప్రస్తుతం విద్యా శాఖ తర్జనభర్జనలు పడుతోంది. అయినా సరే జగన్ మాత్రం తన దూకుడును ఏ మాత్రం తగ్గించటం లేదు. ఈ పథకానికి సంబంధించి జగన్ గురువారం నాడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే ఇంటర్ విద్యార్ధులకు కూడా అమ్మ ఒడి అమలు చేయాలని. గురువారం విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలతోపాటు హాస్టల్లో ఉంటూ చదివేవారు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఉండే వారికి కూడా ఇకపై అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రటించింది. ఈ పథకం కింద తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు ప్రభుత్వం అందచేయనున్నారు. మొదటగా కేవలం పదో తరగతిలోపు విద్యార్థులకే ఈ పథకంఅమలు చేయాలని ప్రభుత్వం భావించింది. గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం జగన్ ఈ పథకాన్ని ఇంర్మీడియట్ విద్యార్థులకు వర్తింపజేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.