Telugu Gateway
Andhra Pradesh

అమరావతిలో అంతులేని అవినీతి

అమరావతిలో అంతులేని అవినీతి
X

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో అంతులేని అవినీతి కన్పిస్తోందని ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీఆర్ డీఏ సమావేశ అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. ఎక్కడ చూసిన అవినీతే కన్పిస్తోందని..ఇది తేల్చటానికే సమయం పెట్టే అవకాశం ఉందన్నారు. అమరావతి వ్యవహారంలో గత టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రాజధాని వ్యవహారాలను మరింత లోతుగా పరిశీలించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని ఆయన వెల్లడించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారంగా ప్రభుత్వం వారికి చేసిన ప్లాట్ల కేటాయింపుల్లోనూ అవకతవకలు జరిగాయని ఆయన తెలిపారు.

గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని తమ ప్రభుత్వం ఎంత మాత్రం కొనసాగించదని ఆయన తేల్చి చెప్పారు. అందుకే టీడీపీ హయాంలో చేపట్టిన ప్రతీ కార్యక్రమంపైన లోతుగా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. కొత్త ప్రభుత్వం ఇటీవలే ఏర్పడినందున.. తొలుత అవినీతి కూపం నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దాని తరువాత అక్రమ నిర్మాణాలపై దృష్టి పెడతామన్నారు. రాజధాని వ్యవహారంపై అధికారులతో త్వరలో మరోసారి సమావేశం నిర్ణయిస్తామని.. ఆ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

Next Story
Share it