అల్లు అర్జున్ సినిమా రెండో షెడ్యూల్
BY Telugu Gateway5 Jun 2019 6:09 AM GMT
X
Telugu Gateway5 Jun 2019 6:09 AM GMT
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ సినిమా రెండవ షెడ్యూల్ బుధవారం నాడు ప్రారంభం అయింది. ఈ సినిమాలో ఆయనకు జోడీగా పూజా హెగ్డె నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణలు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అల్లు అర్జున్, పూజా హెగ్డెలు కలిసి నటిస్తున్న రెండవ సినిమా ఇది.
గతంలో వీరిద్దరూ కలసి దువ్వాడ జగన్నాథం సినిమాలో కలసి పనిచేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా కావటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రెండవ షెడ్యూల్ ప్రారంభం అయిన విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
Next Story