క్షీణించిన అక్భరుద్దీన్ ఆరోగ్యం
BY Telugu Gateway9 Jun 2019 7:36 PM IST

X
Telugu Gateway9 Jun 2019 7:36 PM IST
ఎంఐఎం శాసనసభాపక్ష నేత, సీనియర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన్ను మెరుగైన వైద్యం కోసం లండన్ తరలించారు. కొద్ది సంవత్సరాల క్రితం చందాయణగుట్ట సమీపంలో అక్బరుద్దీన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి నుంచి తృటిలో ప్రాణాలతో అక్బరుద్దీన్ బయటపడినా.. అప్పట్లో తీవ్ర గాయాలు కావడంతో ఆయన ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆకస్మికంగా అక్బరుద్దీన్ ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తోంది.
దీంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను లండన్ ఆస్పత్రికి తరలించారు. సోదరుడు అక్బర్ త్వరగా కోలుకోవాలంటూ దేవుడిని ప్రార్థించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ శ్రేణులు, అభిమానులను కోరారు. ఇఫ్పటికీ అక్బరుద్దీన్ కడుపులో బుల్లెట్ ఉందని..ఇదే ఇప్పుడు సమస్యకు కారణం అని చెబుతున్నారు.
Next Story