Telugu Gateway
Politics

అజిత్ దోవల్ కు మళ్ళీ ఛాన్స్..కేబినెట్ హోదాతో

అజిత్ దోవల్ కు మళ్ళీ ఛాన్స్..కేబినెట్ హోదాతో
X

అజిత్ దోవల్. కేంద్రంలో మోడీ సర్కారు కొలువుదీరినప్పటి నుంచి బాగా విన్పించిన పేరు. ఐదేళ్ళ పాటు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)గా వ్యవహరించిన అజిత్‌ దోవల్‌ ఈ సారి పదోన్నతి కూడా పొందారు. అదే పోస్టులో కేబినెట్ మంత్రి హోదాతో కొనసాగనునున్నారు. మరో ఐదేళ్ల వరకూ దోవల్‌ను ఈ పదవిలో నియమించినట్టు సోమవారం ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో సహాయ మంత్రి హోదాలో ఎన్‌ఎస్‌ఏగా సేవలందించిన అజిత్‌ దోవల్‌కు ప్రస్తుతం క్యాబినెట్‌ హోదా కల్పించారు. జాతీయ భద్రతా సలహాదారు బాధ్యతలు చేపట్టకముందు దోవల్‌ ఐబీ చీఫ్‌గా వ్యవహరించారు.

అజిత్‌ దోవల్‌ మార్గదర్శకత్వంలో యూరి ఉగ్రదాడి అనంతరం 2016లో పాకిస్తాన్‌పై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టగా, పుల్వామా దాడి అనంతరం 2018లోనూ బాలాకోట్‌లో భారత వైమానిక దళం సర్జికల్‌ స్ర్టైక్స్‌ నిర్వహించింది. మోడీ ప్రధానిగా ఉన్నంత వరకూ లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకూ దోవల్ ఈ పోస్టులో ఉంటారని కేంద్రంలో నియామకాల కమిటీ తన ఆదేశాల్లో పేర్కొంది.

Next Story
Share it