నిర్మాతగా మారుతున్న కాజల్
టాలీవుడ్ కొత్త పోకడలు పోతోంది. స్టార్ హీరోలు మొదలుకుని..యంగ్ హీరోల వరకూ ఇప్పుడు నిర్మాతలుగా మారుతున్నారు. కొంత మంది హీరోయిన్లు కూడా తాము మాత్రం ఏమి తక్కువ అంటూ ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే హీరో మహేష్ బాబు నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నారు. సొంత సినిమాలకు నిర్మాతగా వ్యవహరించటంతోపాటు..కొత్త కథలు..కొత్త కథలతో వచ్చే దర్శకులకు ఛాన్స్ ఇవ్వటానికి రెడీ అయిపోయారు. మరో హీరో రామ్ చరణ్ అయితే భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతగా మారిపోయారు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు సక్సెస్ ఫుల్ నిర్మాతగా ముందుకు సాగుతున్నారు. హీరో నాని కూడా అదే బాటలో ఉన్నారు.
ఆయన ఇప్పటికే నిర్మాతగా ‘ఆ!’ సినిమాను నిర్మాతగా తెరకెక్కించారు. ఇలా మంది హీరోలు..నిర్మాతలు మారారు. ఇఫ్పుడు హీరోయిన్ల వంతు వచ్చింది. టాలీవుడ్ లో దశాబ్దానికి పైగా హల్ చల్ చేస్తున్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు నిర్మాతగా మారారు. మను చరిత్ర’ సినిమాకు కాజల్ నిర్మాతగా మారి కొత్త రోల్ లోకి ప్రవేశిస్తున్నారు. బుధవారం కాజల్ అగర్వాల్ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె నటించిన ‘రణరంగం’ చిత్రంలోని లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో బీచ్ ఒడ్డున కాజల్ ఆనందంగా సందడి చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రశాంత్ పిళ్లై సంగీతం అందించారు. ఇందులో హీరో శర్వానంద్.