Telugu Gateway
Cinema

నగ్నంగా అమలాపాల్

నగ్నంగా అమలాపాల్
X

అమలాపాల్. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న హీరోయిన్. ఈ మధ్యకాలంలో ఆమె తెలుగు సినిమాలు ఏమీ చేయటం లేదు. ఇఫ్పుడు అమలాపాల్ నటించిన తమిళ సినిమా ఒకటి ‘ఆమె’ పేరుతో తెలుగులో వస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ విశేషం ఉంది. అమలాపాల్ ఇందులో ఓ సన్నివేశంలో నగ్నంగా నటించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఓ తల్లి తన కూతురు తప్పి పోయినట్టుగా పోలీస్‌ స్టేషన్లో కంప్లయింట్‌ ఇవ్వటం తరువాత పోలీసులకు అమలా పాల్‌ దారుణమైన పరిస్థితుల్లో కనిపించటం లాంటి సన్నివేశాలతో టీజర్‌ను కట్ చేశారు.

గతంలో సౌత్‌ లో ఏ హీరోయిన్‌ చేయని సాహసం చేసిన అమలాపాల్‌ను సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. వీ స్టూడియోస్‌ బ్యానర్‌పై రత్నకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ టీజర్‌ను బాలీవుడ్ దర్శకుడు కరణ్‌ జోహార్‌ విడుదల చేయగా తెలుగు టీజర్‌ను చేశారు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. తమిళంలో ఆడైగా ఈ సినిమా విడుదల కానుంది. కొత్తగా విడుదల చేసిన ఈ టీజర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.

https://www.youtube.com/watch?time_continue=92&v=uJVck_9t-q0

Next Story
Share it