Telugu Gateway
Politics

ఇండియా టుడే ఎగ్జిట్ పోల్..వైసీపీదే హవా

ఇండియా టుడే ఎగ్జిట్ పోల్..వైసీపీదే హవా
X

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోరు ఆదివారంతో ముగిసింది. ఇక మిగిలింది అసలు ఫలితాలే. అయితే ఇది ఎగ్జిట్ పోల్ సీజన్. వాస్తవ ప్రజాభిప్రాయం ఏంటి?. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏంటి?. అసలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. ఇవే ఇప్పుడు కీలక అంశాలు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణతో పోలిస్తే అందరిలో ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ ఫలితాలపైనే. ఎందుకంటే అక్కడ అసెంబ్లీతోపాటు లోక్ సభకూ ఎన్నికలు జరిగాయి.

తెలంగాణలో ఒక్క లోక్ సభ మాత్రమే జరిగిన సంగతి తెలిసిందే. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఏపీ అసెంబ్లీ పోరులో ఎవరో విజేతగా నిలుస్తారో అన్న అంశంపై అత్యంత ఆసక్తి నెలకొంది. ఇండియా టుడే-యాక్సిస్ ఎగ్జిట్ పోల్ మాత్రం ఏపీలో వైసీపీ 18 నుంచి 20 ఎంపీ సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తెలంగాణ ఎన్నికల్లోనూ ఈ సంస్థ ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడ్డాయి. టీడీపీ మాత్రం 4 నుంచి ఆరు ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. జనసేనకు కూడా ఇండియా టుడే ఒక సీటును ఇవ్వటం విశేషం.

Next Story
Share it