తెనాలి రామకృష్ణ ఫస్ట్ లుక్
BY Telugu Gateway7 May 2019 8:42 AM GMT

X
Telugu Gateway7 May 2019 8:42 AM GMT
సందీప్ కిషన్ దూకుడు పెంచారు. కొంత కాలం గ్యాప్ తీసుకున్న ఈ కుర్ర హీరో మళ్ళీ సినిమాలను ట్రాక్ లో పెట్టాడు. ఇప్పుడు ఏకంగా ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు. ఓ వైపు తాను కూడా నిర్మాతగా మారి ‘నిను వీడని నీడను నేనే’ సినిమా బిజీలో ఉన్నాడు. మరో వైపు ‘తెనాలి రామకృష్ణ’. కేసులివ్వండి ప్లీజ్ ఉప శీర్షికతో మరో సినిమాలో నటిస్తున్నాడు సందీప్.
దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో హన్సిక, వరలక్ష్మి శరత్ కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెనాలి రామకృష్ణ ఫస్ట్ లుక్ ఫన్నీగా ఉంది. టేబుల్ పై ఫైళ్ళు చిందరవందరగా వేసుకుని..కేసుల కోసం రిక్వెస్ట్ చేస్తున్నట్లు ఫోటో ఆసక్తికరంగా ఉంది. త్వరలోనే తెనాలి రామకృష్ణ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Next Story