రెచ్చిపోయిన తమన్నా
తమన్నా ఈ మధ్య జోరు పెంచింది. కొద్ది కాలం క్రితం విడుదలై సూపర్ విజయాన్ని అందుకున్న ఎఫ్ 2 సినిమాలో ఓ పాటలో తమన్నా పూర్తి స్థాయిలో అందాలు ఆరబోసింది. ఇప్పుడు అభినేత్రి 2 సినిమాలో మరింత రెచ్చిపోయినట్లు కన్పిస్తోంది. ఈ పాట మాత్రం అభిమానులకు కిక్కు ఇచ్చేలా ఉంది. ఓ వైపు తమన్నా అందాల అరబోతతో రెచ్చిపోతుంటే ఆమెను నియంత్రించేందుకు హీరో ప్రభుదేవా దేవుడి ఫోటోలు..గౌతమ బుద్దుడి ఫోటోలు చూపిస్తూ ఉంటారు.
అభినేత్రి2 సినిమాకు సంబంధించిన రెడీ రెడీ పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో తమన్నా హాట్ హాట్ అందాలు ప్రేక్షకుల మతిపోగొట్టడం ఖాయంగా కన్పిస్తోంది. అంతలా రెచ్చిపోయింది తమన్నా ఈ సాంగ్ లో. ఈ నెల31న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. తమిళంలో ఈ సినిమా దేవిగా విడుదల కానుంది.
https://www.youtube.com/watch?time_continue=3&v=DWFl_ZYsRLM