Telugu Gateway
Politics

‘రహస్య’ ఖాతాల గుట్టువిప్పనున్న స్విస్ బ్యాంక్!

‘రహస్య’ ఖాతాల గుట్టువిప్పనున్న స్విస్ బ్యాంక్!
X

అవినీతి..అక్రమ మార్గాల్లో వేల కోట్ల రూపాయలు సంపాదించి చాలా మంది విదేశాల్లో దాచుకున్నారు. ఇలాంటి వారందరికీ స్వర్గథామం స్విట్జర్లాండ్. స్విస్ బ్యాంక్ లో ఎంత డబ్బు దాచుకున్నా ఎవరూ అడగరు. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే భారత్ ఎప్పటి నుంచో స్విస్ బ్యాంకులో ఖాతాలు ఉన్న తమ వారి వివరాలు వెల్లడించాల్సిందిగా కోరుతోంది. అయితే తమ బ్యాంకు నిబంధనలకు ఇది వ్యతిరేకం అయినందున ఇందుకు ససేమిరా అంటూ వస్తోంది. తాజాగా ఈ విషయంలో కాస్త మెత్తపడినట్లు కన్పిస్తోంది. తాజాగా స్విస్ బ్యాంకులో ఖాతాలు ఉన్న పదకొండు మందికి నోటీసులు జారీ చేసింది. అందులో భాగంగా రహస్య ఖాతాలు కలిగిన 11 మందికి నోటీసులు జారీ చేశారు.

స్విస్ బ్యాంకు నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే అప్పీల్ చేసుకోవటానికి వీలుగా వీరు ఈ నోటీసులు జారీ చేశారు. అయితే స్విస్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన వారికి సంబంధించిన సంక్షిప్త వివరాలను మాత్రమే పేర్కొంది. వారి పేర్లను సంక్షిప్తంగా వెల్లడిస్తూ..పుట్టిన తేదీలను మాత్రం బహిర్గతం చేసింది. వీళ్లంతా ఎందుకు తమ వివరాలను భారత ప్రభుత్వానికి తెలియజేయటానికి ఎందుకు అభ్యంతరాలు ఉన్నాయో చెప్పాల్సి ఉంటుంది.నిజంగా రహస్య ఖాతాల వారి వివరాలు వెల్లడి అయితే ఇది పెను సంచలనంగా మారటం ఖాయంగా కన్పిస్తోంది.

Next Story
Share it