Telugu Gateway
Telangana

శ్రీకృష్ణ జ్యువెలర్స్ ఎండీ ప్రదీప్ కుమార్ అరెస్టు

శ్రీకృష్ణ జ్యువెలర్స్ ఎండీ ప్రదీప్ కుమార్ అరెస్టు
X

బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకు చాలా మంది బంగారాన్ని ఆశ్రయిస్తున్నారు. రకరకాల మార్గాల్లో ఇది కూడా ఓ కీలక అస్త్రంగా మారింది. దీంతో ఆదాయ పన్ను శాఖతో పాటు నిఘా విభాగాలు కూడా బంగారం విక్రయ సంస్థలపై ఫోకస్ పెట్టాయి. హైదరాబాద్ లోని ప్రముఖ సంస్థ శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఎండీ ప్రదీప్ కుమార్‌ అరెస్ట్ వ్యాపార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆయనతోపాటు కుమారుడు సాయి చరణ్‌ను డీఆర్ఐ(డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌) అధికారులు అరెస్ట్ చేశారు.

విదేశాల నుంచి అక్రమంగా బంగారం కొనుగోలు చేసి, ట్యాక్స్‌ లు ఎగ్గొట్టిన ఆరోపణలపై వీరిని అరెస్ట్‌ చేసినట్లు ప్రాధమిక సమాచారం. డీఆర్‌ఐ అధికారులు ప్రదీప్ కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా ముప్పై ఐదు కంపెనీలను ప్రదీప్ కుమార్ నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో కూడా ప్రదీప్ కుమార్ బంగారం వ్యాపారం చేస్తున్నారు. విదేశాల్లోనూ ఆయన వ్యాపారం ఉంది.

Next Story
Share it