సీత ట్రైలర్ విడుదల
BY Telugu Gateway10 May 2019 10:46 AM IST
X
Telugu Gateway10 May 2019 10:46 AM IST
‘నా పేరు సీత. నేను గీసిందే గీత. ‘సీత’ సినిమా ట్రైలర్ లో కాజల్ డైలాగ్ ఇది. అంతే కాదు..ప్రాస బాగుంది కదా? అంటూ తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చేసుకుంది. ఇది చూసి తనికెళ్ళ భరణి కూడా ‘ఇది కంచుకే కంచులా ఉందిరా బాబూ’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి సరదా డైలాగ్ లు..ఫైటింగ్ లతో కూడిన సీత ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కాజల్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరో. ఈ సినిమా మే24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో సోనూసూద్ విలన్ క్యారెక్టర్ చేశారు. కాజల్ తోపాటు ఈ సినిమాలో మన్నారా చోప్రా కూడా ఉన్నారు.
https://www.youtube.com/watch?v=Ry_4LeMYMLU
Next Story