మహేష్ కొత్త సినిమా టైటిల్ అదే
‘సరిలేరు నీకెవ్వరూ’. మహేష్ బాబు 26వ సినిమా టైటిల్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ను హీరో కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా వెల్లడించారు. అంతే కాదు..ఈ సినిమా 2020 సంక్రాంతి బరిలో నిలుస్తుందని కూడా ప్రకటించారు. ఈ సినిమాలో ప్రచారం జరుగుతున్నట్లుగానే రష్మిక మందన హీరోయిన్. ఆమె కూడా ఇంత అద్భుతమైన ప్రాజెక్టులో భాగస్వామి అయినందుకు ఎంతో సంతోషంగా ఉందని సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సినిమా నిర్మాతల్లో ఒకరిగా కూడా మహేష్ బాబు వ్యవహరించనున్నారు. ఇతర నిర్మాతలు దిల్ రాజు, అనిల్ సుంకర. ఈ సినిమాకు మ్యూజిక్ దేవీశ్రీ ప్రసాద్ అందించనున్నారు. టైటిల్ వివరాల వెల్లడికి సంబంధించి మహేష్ బాబు నటించిన 25 చిత్రాల పేర్లతో ఓ వీడియోను విడుదల చేశారు. మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి డివైడ్ టాక్ వచ్చినా కూడా 175 కోట్ల రూపాయల గ్రాస్ సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.