నాథూరాం గాడ్సే దేశ భక్తుడు
BY Telugu Gateway16 May 2019 4:27 PM IST

X
Telugu Gateway16 May 2019 4:27 PM IST
మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను కమల్ హాసన్ దేశంలోని తొలి హిందూ ఉగ్రవాది అంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఇప్పుడు బిజెపి ఫైర్ బ్రాండ్ నేత, భోపాల్ లోక్ సభ బరిలో నిలిచిన సాధ్వి ప్రజ్ఞా సింగ్ తాజాగా గాడ్సేను దేశ భక్తుడిగా కీర్తించారు. ఆయన దేశభక్తుడిగానే ప్రజల్లో మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. గాడ్సేను ఉగ్రవాదిగా పిలిచే వారికి ప్రజలు ఈ ఎన్నికల్లో దీటుగా బదులిస్తారని అన్నారు. ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలు మరో వివాదానికి ఆజ్యం పోశాయి. బిజెపి వెంటనే సాధ్వి వ్యాఖ్యలపై స్పందించింది. ఆమె వ్యాఖ్యలను ఖండించింది. కాంగ్రెస్ పార్టీ ఆమె వ్యాఖ్యలపై మండిపడింది.
Next Story



