రేవంత్ రెడ్డి రిటర్న్స్

ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఎంపీగా గెలిచారు. ఐదు నెలల్లోనే జరిగిన మార్పు ఇది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో ఓటమి పాలైన రేవంత్ రెడ్డి ఈ సారి అనూహ్యంగా మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంలో మాత్రం విజయాన్ని దక్కించుకున్నారు. ఇది రాజకీయంగా రేవంత్ రెడ్డికి అత్యంత కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. అధికార టీఆర్ఎస్ నుంచి తీవ్ర పోటీ ఉన్నా..ఆయన విజయం సాధించారు. తెలంగాణలో కీలక నేతలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిది కూడా ఇదే పరిస్థితి. ఆయన కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై..భువనగిరి నియోజకవర్గంలో మాత్రం ఎంపీగా విజయం సాధించారు.
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నల్లగొండ ఎంపీ బరిలో నిలిచి విజయాన్ని దక్కించుకున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకమైన లోక్ సభ ఎన్నికల్లో మూడు సీట్లను దక్కించుకుని సత్తా చాటిందనే చెప్పారు. ఓ వైపు అధికార టీఆర్ఎస్ తెలంగాణలోని 17 సీట్లలో 16 సీట్లను దక్కించుకుంటామని ఘంటాపథంగా చెప్పుకున్నా..కాంగ్రెస్ నేతలు పోరాడి ఈ సీట్లను దక్కించుకోగలిగారు.



