కౌంటింగ్ తర్వాత కూడా రీపోలింగ్
BY Telugu Gateway21 May 2019 10:20 PM IST

X
Telugu Gateway21 May 2019 10:20 PM IST
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఓ సంచలన ప్రకటన చేశారు. అవసరం అయితే..కౌంటింగ్ తర్వాత కూడా రీ పోలింగ్ నిర్వహించే ఛాన్స్ ఉందని ప్రకటించారు. గతంలో ఎప్పుడూ ఇలా జరిగిన దాఖలాలు ఉన్నట్లు లేదు. ద్వివేది మంగళవారం అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ.. తప్పనిసరి పరిస్థితుల్లో కౌంటింగ్ పూర్తైన తర్వాత కూడా రీపోలింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈవీఎంలు మొరాయించి, వీవీప్యాట్ లెక్కలో తేడా వచ్చినా, మిగతా లెక్కింపులో పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం అతి తక్కువగా ఉంటే రీపోలింగ్‌కు ఆదేశించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఇక మే 27 అర్ధరాత్రి వరకు ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని, ఫలితాల వెల్లడిలో ఆర్వోలదే తుది నిర్ణయమని పేర్కొన్నారు.
Next Story



