తప్పు చేయకపోతే పరారీ ఎందుకు?
BY Telugu Gateway22 May 2019 4:37 PM IST

X
Telugu Gateway22 May 2019 4:37 PM IST
రవి ప్రకాష్ తాజాగా విడుదల చేసిన వీడియోపై టీవీ9 యాజమాన్యం స్పందించింది. టీవీ 9 లోగో తనదని, రాయల్టీ ఇవ్వకుండా కొత్త యాజమాన్యం కైవసం చేసుకుందని రవిప్రకాష్ ఆరోపించారు.తప్పుడు కేసులు పెట్టారని ఆయన అంటున్నారు.
తప్పుడు కేసులైతే పోలీసుల విచారణకు ఎందుకు హాజరుకావడం లేదని ప్రశ్నించింది.
టీవీ9 సంస్థకు చెందిన లోగోను తన సొంతమనడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏబీసీఎల్ సంస్థలో మెజారిటీ వాటా లేకున్నా పెత్తనం చెలాయించేందుకు రవిప్రకాష్ యత్నించాడని, పలు అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించింది. తప్పు చేయనప్పుడు ఎందుకు తప్పించుకు తిరగడమని ప్రశ్నించింది.
Next Story



