Telugu Gateway
Politics

మెగా కృష్ణారెడ్డిపై రవిప్రకాష్ సంచలన ఆరోపణలు

మెగా కృష్ణారెడ్డిపై రవిప్రకాష్ సంచలన ఆరోపణలు
X

గత కొంత కాలంగా అజ్ణాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ మరోసారి ‘వీడియో’ను విడుదల చేశారు. అందులో మెగా ఇంజనీరింగ్ సంస్థ ఎండీ కృష్ణారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ9లో పెట్టుబడి పెట్టిన శ్రీనివాజు తాను అందులో పెట్టుబడి పెట్టి చాలా రోజులు అయిందని..లాభాలతో తాను బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. తాను అందుకు అంగీకరించి చాలా మందిని కలిసినట్లు రవిప్రకాష్ తెలిపారు. ఒక్క రూపాయి లాభం ఆశించకుండా.. ఏ ప్రయోజనం ఆశించకుండా ఈ డీల్ ను విజయవంతం చేయాలని ఆశించాను. ఆ ప్రయత్నంలో భాగంగా మెగా కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్ తనను కలిశారని..తాను మరో నలుగురు మిత్రులతో కలసి తలా ఒక 20 శాతం తీసుకుని ఏబీసీఎల్ లో పెట్టుబడి పెడతాం...రవిప్రకాష్ కు పూర్తి స్వేచ్చ ఉంది. ఆపరేషన్ విషయంలో .. నడిపే విషయం లో పూర్తి స్వేచ్చ ఉంటుందని తెలిపారు. ఈ మేరకు నాకు మాట ఇచ్చారు. ఆ తర్వాత శ్రీనిరాజుతో కలిపించాను. శ్రీనిరాజు లాభాలతో బయటపడ్డారు. మెగా కృష్ణారెడ్డి తన స్నేహితులతో కలసి తన పెట్టుబడులతో టీవీ9 సంస్థలోకి వస్తారని ఆశించాను. కానీ తాను ఆశించింది ఒకటి...జరిగింది మరొకటి. మెగా కృష్ణారెడ్డి స్థానంలో మెజారిటీ వాటాదారుడుగా రామేశ్వరరావు టీవీ9 సంస్థ ఏబీసీఎల్ లోకి వచ్చారు. మెగా కృష్ణారెడ్డిని అడిగాను మీరు చెప్పింది ఏమిటి?. జరిగింది ఏమిటి?.

మీరు మీ మిత్రులతో కలసి వస్తామని..ఎవరికీ మెజారిటీ వాటా ఉండదని చెప్పి నాకు మాట ఇఛ్చారు. మాట తప్పారు. ఇప్పుడు రామేశ్వరరావు వచ్చారు. తర్వాత రామేశ్వరరావుతో మాట్లాడటం మొదలుపెట్టాను. మైనారిటీ వాటాదారుగా ఉన్నా తాను సంస్థను ఈ స్థాయికి తెచ్చానని..విస్తరణకు పని చేశానని, మనిద్దరి మధ్యలో షేర్ హోల్డర్ అగ్రిమెంట్ అనేది అవసరం అని చట్టం చెబుతుంది. చట్టరీత్యా అవసరం ఉందని చెప్పాను. షేర్ హోల్డర్ల మధ్య ఒఫ్పందం, ఒడంబడిక ఖచ్చితంగా కావాలి. రామేశ్వరరావు ఈ అంశంపై మాట్లాడుతూ తనది కుటుంబ వ్యాపారం అని..అందులో స్వేచ్చకు కొన్ని పరిమితులు ఉంటాయని..అందుకు తనతో ఎలాంటి రాతపూర్వక ఒడండిక చేసుకోలేనని తెలిపారన్నారు. ‘నువ్వు నా దగ్గర ఒక జీతగాడిలా పాలేరులా’ పనిచేయాల్సి ఉంటుందని రామేశ్వరరావు తో తనతో చెప్పారన్నారు. ఈ విషయంలో ప్రతిఘటించినప్పుడు తనను ఇబ్బందుల పాలు చేస్తానని..టీవీ9 వదిలి బయటకు వెళ్ళేలా చూస్తానని తెలిపారని రవిప్రకాష్ తన వీడియోలో ఆరోపించారు. ఇప్పుడు అందుకు అనుగుణంగానే తాను మూడు తప్పుడు కేసులు ఎదుర్కొంటున్నట్లు రవిప్రకాష్ తెలిపారు. ఏదో తీవ్రవాది పారిపోతున్నాడన్నట్లు ఎయిర్ పోర్టులో,,షిప్ యార్డులో అలర్ట్ లు జారీ చేస్తున్నారని ఆరోపించారు.

Next Story
Share it