Telugu Gateway
Telangana

రవిప్రకాష్ కు కోర్టులో చుక్కెదురు

రవిప్రకాష్ కు కోర్టులో చుక్కెదురు
X

ఫోర్జరీతోపాటు పలు రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు హైకోర్టులో చుక్కెదురు అయింది. పోలీసులు జారీ చేసిన నోటీసులకు స్పందించకుండా పరారీలో ఉన్న రవిప్రకాష్ ముందస్తు బెయిల్ తోపాటు తనపై దాఖలైన కేసులను కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఈ పిటీషన్ ను తిరస్కరించింది. అత్యవసరంగా దీన్ని వినాల్సిన అవసరం లేదని..సెలవులు పూర్తయిన తర్వాత జూన్ లో విచారణ చేపడతామని పేర్కొంది.

రవిప్రకాశ్‌కు పోలీసులు తాజాగా సీఆర్‌పీసీ సెక్షన్‌ 41 కింద నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసుల ప్రకారం బుధవారం సాయంత్రం లోగా ఆయన పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. మరోవైపు న్యాయస్థానంలో కూడా ఎదురుదెబ్బ తగలడంతో రవిప్రకాశ్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరు అవుతారా? లేదా అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ కేసులో మరో నిందితుడు సినీనటుడు శొంఠినేని శివాజీ కూడా పరారీలోనే ఉండటం గమనార్హం.

Next Story
Share it