విహారయాత్రలో రామ్ చరణ్
BY Telugu Gateway30 May 2019 10:41 AM IST

X
Telugu Gateway30 May 2019 10:41 AM IST
హీరోగా..నిర్మాతగా బాధ్యతలు నిర్వహిస్తున్న రామ్ చరణ్ ప్రస్తుతం ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్‘ నుంచి కొద్దిగా బ్రేక్ తీసుకున్నట్లు కన్పిస్తోంది. ఎందుకంటే రామ్ చరణ్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో భార్య ఉపాసనతో కలసి హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు.
జూన్ 14న రామ్ చరణ్, ఉపాసన పెళ్ళి రోజు. గాయాలతో ఇబ్బంది పడుతున్న చరణ్ కు రిలీఫ్ కోసం ముందుగానే హాలిడే ప్లాన్ చేసుకుంటున్నట్లు ఉపాసన వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Next Story



