Telugu Gateway
Politics

రాహుల్ క్షమాపణ

రాహుల్ క్షమాపణ
X

విచారం..విచారం కాస్తా క్షమాపణగా మారిపోయింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు భేషరతు క్షమాపణ చెప్పారు. రాఫెల్ కేసులో ప్రధాని మోడీని ఉద్దేశించి సుప్రీంకోర్టు కూడా కాపలాదారే దొంగ అని నిర్ధారించినట్లు వ్యాఖ్యానించి చిక్కుల్లో పడ్డారు. రాహుల్ వ్యాఖ్యలపై బిజెపి ఎంపీ మీనాక్షి లేఖి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇప్పటికే రెండు సార్లు ఈ అంశంపై విచారణ జరగ్గా..తొలుత విచారం..విచారం అంటూ సరిపుచ్చారు. దీనిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయటంలో చివరకు భేషరతు క్షమాపణ చెబుతున్నట్లు లిఖితపూర్వకంగా తెలిపారు.

ఈ మేరకు ఆయన బుధవారం అఫిడవిట్‌ దాఖలు చేశారు. తనపై నమోదైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై శుక్రవారం విచారణ చేపడతామని సుప్రీం కోర్టు తెలిపింది. గౌరవ న్యాయస్ధానానికి తాను అన్యాపదేశంగా తన ఉద్దేశాన్ని ఆపాదించినందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని, తాను ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని అఫిడవిట్‌లో రాహుల్‌ పేర్కొన్నారు.

Next Story
Share it