Telugu Gateway
Politics

రాహుల్ తో చంద్రబాబు భేటీ

రాహుల్ తో చంద్రబాబు భేటీ
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. మరో రెండు దశల్లో ఎన్నికలు ముగియనుండటం..కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరటానికి ప్రాంతీయ పార్టీల సహకారం తప్పనిసరి అని అంచనాలు వెలువడుతున్న సమయంలో వీరిద్దరి భేటీ ఆసక్తికరంగా మారింది. ఓ వైపు తెలంగాణ ముఖ్యమంత్రి, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రయత్నాలు మొదలుపెట్టిన కెసీఆర్ కూడా మరో వైపు తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు.

అయితే రాహుల్, చంద్రబాబుల మధ్య జరిగిన చర్చలు ఏంటనేది ప్రస్తుతానికి బయటకు రాలేదు. ఎన్నికల తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు, రాహుల్ ల భేటీ సుమారు అర గంట పాటు సాగింది. రాహుల్ తో సమావేశం అనంతరం చంద్రబాబు పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. బుధ, గురువారాల్లో ఆయన అక్కడే ప్రచారం చేస్తారని చెబుతున్నారు.

Next Story
Share it