Telugu Gateway
Cinema

‘సాహో’ షూటింగ్ పూర్తి!

‘సాహో’ షూటింగ్ పూర్తి!
X

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన మరో భారీ చిత్రం ఈ ‘సాహో’. ఆదివారంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. విదేశాల్లో భారీ వ్యయంతో చేసిన అత్యంత కీలకమైన సన్నివేశాలు..కారు ఛేజింగ్ లు..ఫైట్లు ఈ సినిమాకు ప్రత్యేకంగా నిలవబోతున్నాయి. సుమారు 300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది.

ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ నటించిన సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సాహో సినిమా షూటింగ్ పూర్తయిన విషయాన్ని ప్రముఖ నటుడు మురళీ శర్మ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆగస్టు 15న సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Next Story
Share it