ప్రభాస్ ‘సాహో కష్టాలు’
బాహుబలి వంటి భారీ సినిమాను అలవోకగా చేసేసిన ప్రభాస్ ‘సాహో’ కోసం కష్టాలు పడుతున్నారా?. అంటే ఔననే సమాధానం వస్తోంది. అయితే ఇదేదో యాక్షన్స్ కు సంబంధించిన సమస్య కాదు. ఇదీ భాషా సమస్య మాత్రమే. సాహో కోసం ప్రభాస్ ఏకంగా ట్యూటర్ పెట్టుకుని హిందీ నేర్చుకుంటున్నాడ. దీనికే ఆయన కష్టాలు పడాల్సి వస్తోంది. ప్రస్తుతం సమస్య అధిగమించానని..అంతా సాఫీగా సాగుతోందని చెబుతున్నాడు ఈ హీరో. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళంలో ఏకంగా విడుదల చేయనున్నారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ఆగస్టు15కు విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నహాల్లో ఉంది. బాహుబలి రెండు భాగాల తర్వాత వస్తున్న సినిమా కావటంతో ప్రభాస్ అభిమానుల్లో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.