పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగుపెడతారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో రెండు చోట్ల నుంచి అసెంబ్లీ బరిలో నిలిచారు. ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, మరొకటి విశాఖపట్నం జిల్లాలోని గాజువాక. అయితే పవన్ గెలుస్తారా? లేదా అన్న దానిపై రకరకాల అంచనాలు వెలువడుతున్నాయి. అయితే పవన్ పోటీచేసిన రెండు చోట్ల కూడా తీవ్ర పోటీనే ఎదుర్కొన్నారు. లగడపాటి రాజగోపాల్ మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగుపెట్టడం ఖాయం అని ప్రకటించారు. అయితే ఆయన ఏ సీటులో విజయం సాధిస్తారో తెలియాలంటే మే 23 వరకూ వేచిచూడాల్సిందే.
శనివారం నాడు మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ ఈ విషయం చెప్పారు. అయితే ప్రజారాజ్యం అంత ప్రభావం జనసేన చూపించలేదని చెప్పారు. ఆ పార్టీ కంటే సీట్లు బాగా తక్కువగా వస్తాయని అన్నారు. తాను చెప్పే అంచనాలను చూసుకుని బెట్టింగ్ లకు పాల్పడవద్దని సూచించారు. తాను ప్రస్తుతం ఏ పార్టీలో లేనని..ఎవరి కోసం పని చేయటం లేదని లగడపాటి చెప్పుకున్నారు.