Top
Telugu Gateway

సినీ నటుల డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్

సినీ నటుల డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్
X

టాలీవుడ్ ను కుదిపేసిన డ్రగ్స్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్. ఎంతో హంగామా చేసి ఈ కేసులో ఏమీ తేల్చకుండానే సిట్ చేతులెత్తేసిందనే విమర్శలు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సమాచార హక్కు చట్టం కింద తీసుకున్న వివరాల ప్రకారం సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చేశారనే అభిప్రాయం వ్యక్తం అయింది. ఈ వార్తలపై ఎక్సైజ్ శాఖ స్పందించింది. సినీ నటులకు క్లీన్ చిట్ ఏ మాత్రం నిజం కాదని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఏడు ఛార్జిషీట్లు దాఖలు చేశామని..ఇంకా ఐదు అభియోగపత్రాలు దాఖలు చేయాల్సి ఉందన్నారు.

ఈ కేసుకు సంబంధించి ఇంకా పలు ఆధారాలు రావాల్సి ఉందని తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోమని తెలిపారు. తమకు దొరికిన ఆధారాల ప్రకారమే ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసు వెల్లడైన సమయంలో సర్కారు స్పందించిన తీరు..తర్వాత ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పక్కదారి పట్టిందనే విమర్శలు వెల్లువెత్తాయి. కానీ కొంత మంది సినీ ప్రముఖులకు సంబంధించి పక్కా ఆధారాలు లభించాయని..ఎవరినీ వదిలిపెట్టేదిలేదని గట్టిగా ప్రకటించినన ఎక్సైజ్ శాఖ ఇఫ్పుడు మాత్రం ఆ పేర్ల గురించి మాత్రం ప్రస్తావించటం లేదు.

Next Story
Share it