Telugu Gateway
Cinema

‘నినువీడని నీడను నేనే’ టీజర్ విడుదల

‘నినువీడని నీడను నేనే’ టీజర్ విడుదల
X

సందీప్ కిషన్. సక్సెస్ కోసం తపిస్తున్న హీరో. చేసిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఇప్పుడు తాను కూడా ఓ నిర్మాతగా మారి సినిమా చేస్తున్నాడు. అదే ‘నిను వీడని నీడను నేనే’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ తాజా గా విడుదల చేసింది. ఈ సినిమాలో సందీప్ కిషన్ కు జోడీగా అన్యసింగ్ హీరోయిన్ గా చేస్తోంది. వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ సంస్థలు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నాయి.

ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా ఉంది. సందీప్ కిషన్ అద్దం ముందు నిలబడితో ఆయన ఫోటో కాకుండా వెన్నెల కిషోర్ ఫోటో కన్పిస్తోంది. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నట్లు కన్పిస్తోంది. మరి ఈ సినిమాతో అయినా సందీప్ హిట్ కొడతారో లేదో వేచిచూడాల్సిందే. మురళీశర్మ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=ANphU_Ek-5Y

Next Story
Share it