Top
Telugu Gateway

గుత్తాకు నెక్ట్స్ టైమ్

గుత్తాకు నెక్ట్స్ టైమ్
X

మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి మరికొంత ఎదురుచూడాల్సిందే. ప్రస్తుతం ఎన్నిక జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా టీఆర్ఎస్ తరపున నవీన్ రావు పేరును ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా ఆ స్థానానికి నల్గొండ మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి పేరును ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు నవీన్‌రావు పేరును ఖరారు చేస్తూ కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్‌ రెడ్డి అసంతృప్తికి లోనుకాకుండా ఉండేందుకు.. త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానానికి అవకాశం కల్పిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుండి మైనంపల్లి హన్మంతరావు టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి, విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవికి మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవికి నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్ దాఖలు చేయడానికి మంగళవారం చివరి తేదీ. దీంతో నవీన్ రావు పేరు ఖరారు చేశారు.

Next Story
Share it