Telugu Gateway
Cinema

ఆగస్టులో నాని ‘గ్యాంగ్ లీడర్’ విడుదల

ఆగస్టులో నాని ‘గ్యాంగ్ లీడర్’ విడుదల
X

గ్యాంగ్ లీడర్ టైటిల్ పై వివాదం తలెత్తినా చిత్ర యూనిట్ మాత్రం వెనక్కి తగ్గినట్లు లేదు. నాని హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. అంతే కాదు..ఆగస్టు30న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం)లు నిర్మిస్తున్నారు.

అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాతలు మాట్లాడుతూ ‘మా బేనర్‌లో చేస్తున్న మరో విభిన్న చిత్రం ‘నాని గ్యాంగ్ లీడర్’. 14 నుండి శంషాబాద్ లో మూడో షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయింది. జూన్ 30కి టోటల్ షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ఆగష్టు 30న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేశాం’ అన్నారు. నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ పోషిస్తున్నారు.

Next Story
Share it