Telugu Gateway
Cinema

‘మహర్షి’ సెన్సార్ పూర్తి

‘మహర్షి’ సెన్సార్ పూర్తి
X

మహేష్ బాబు సినీ కెరీర్ లోనే ‘మహర్షి’కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. దీనికి కారణం ఇది ఆయనకు 25 సినిమా కావటమే. దీంతో మహేష్ బాబు అభిమానుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొద్ది కాలం పాటు తడబడిన మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాతో మళ్ళీ గాడిలో పడ్డారు. మే9న విడుదల కానున్న మహర్షిపై చిత్ర యూనిట్ కూడా గట్టి ధీమాతో ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ముఖ్యంగా దర్శకుడు వంశీ పైడిపల్లి అయితే ఇదే విషయాన్ని పలు మార్లు ప్రస్తావించారు.

తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అందరూ ఇదే మాట చెప్పారు మహర్షి సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్‌ లేకుండా సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్‌, జయసుథ, మీనాక్షి దీక్షిత్‌, రాజేంద్ర ప్రసాద్‌, ముఖేష్‌ రుషి ఇలా భారీ తారాగణం నటిస్తున్నారు. ఈ సినిమాకు దిల్‌ రాజు, పీవీపీ, అశ్వనీదత్‌ లు నిర్మాతలుగా ఉన్నారు.

Next Story
Share it