Telugu Gateway
Cinema

మహేష్ మళ్ళీ అదే ఫార్ములా

మహేష్ మళ్ళీ అదే ఫార్ములా
X

సూపర్ స్టార్ మహేష్ బాబు సేమ్ ఫార్ములాను రిపీట్ చేయబోతున్నారు. సహజంగా ఎక్కువ సినిమాలకు నిర్మాత ఒక్కరే ఉంటారు. కొన్ని సినిమాలు కొంత మంది వ్యక్తులు..సంస్థలు సంయుక్తంగా సినీ నిర్మాణంలో భాగస్వాములు అవుతారు. మహేష్ బాబు తన 26 సినిమాకు కూడా ముగ్గురు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఇందులో మరో విశేషం ఏమిటంటే మహేష్ బాబు కూడా అందులో భాగస్వామి కానున్నట్లు సమాచారం.

మరో ఇద్దరు నిర్మాతలుగా దిల్ రాజు, అనిల్ సుంకరలు వ్యవహరించనున్నారు. ఎఫ్2 తో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ కొత్త సినిమా తెరకెక్కనుంది. ఇందులో రష్మిక మందన హీరోయిన్. ఈ సినిమాకు సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం నాడు ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కానుంది.

Next Story
Share it