Telugu Gateway
Politics

సినిమా టిక్కెట్ల రేట్ల పెంపుపై కోర్టుకు సర్కారు

సినిమా టిక్కెట్ల రేట్ల పెంపుపై కోర్టుకు సర్కారు
X

ఇదో విచిత్ర వ్యవహారం. ఎవరైనా ప్రభుత్వంపై కోర్టుకు వెళతారు. కానీ ఇక్కడ ప్రభుత్వమే థియేటర్లపై కోర్టుకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రకటించారు. తెలంగాణలోని కొన్ని థియేటర్లలో రేట్లు పెంచిన అంశంపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి.. కానీ కోర్టు డైరెక్షన్ వల్ల కొన్ని థియేటర్ యాజమాన్యాలు వాళ్లంతట వాళ్లే రేట్లు పెంచినట్లు తెలిసిందని తెలిపారు.

79 థియేటర్లు రేట్లు పెంచినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.. వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నామన్నారు. ఈ విషయంపై కోర్టులో పిటిషన్ వేస్తున్నట్టు తెలిపారు. సామాన్యులు కూడా సినిమా చూడాలి అంటే రేట్లు తక్కువ గానే ఉండాలన్నారు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమానే టిక్కెట్ల వివాదానికి కారణమైంది.

Next Story
Share it