Telugu Gateway
Cinema

‘మహర్షి’ వసూళ్ళు 175 కోట్లు

‘మహర్షి’ వసూళ్ళు 175 కోట్లు
X

మహర్షి సినిమా కంటే ఈ సినిమా వసూళ్ళ లెక్కలు ఎక్కువ వివాదస్పదం అయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన అంశంపై సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా గతంలో ఎన్నడూలేని రీతిలో స్పందించారనే చెప్పుకోవాలి. గతానికి భిన్నంగా మహేష్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వాస్తవానికి ఈ సినిమాకు నిర్మాతలు చెప్పుకుంటున్నట్లు సూపర్ హిట్ టాక్ ఏమీ రాలేదు.

ఓ మూడు సినిమాలను కలిపి ‘మహర్షి’ తీసినట్లు ఉందనే విమర్శలు కూడా విన్పించాయి. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఓ ప్రకటన విడుదల చేసింది. అదేంటి అంటే ఈ సినిమా గ్రాస్ వసూళ్ళు 175 కోట్ల రూపాయలకు చేరినట్లు పేర్కొన్నారు. అయినా సరే ఓవర్సీస్‌లో మహర్షి అంతగా ప్రభావం చూపడం లేదని తెలుస్తోంది. వీకెండ్‌ వ్యవసాయం అనే కాన్సెప్ట్‌ మాత్రం కొంత మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Next Story
Share it