మన్మథుడికి జోడీగా కీర్తి సురేష్!

అక్కినేని నాగార్జున నటించిన ‘మన్మథుడు’ బాక్సాఫీస్ వద్ద ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. ముఖ్యంగా యూత్ ను ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. దీంతో అదే సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు మన్మథుడు2 వస్తోంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే షూటింగ్ లో బిజీగా ఉంది. రకుల్ తోపాటు కొత్తగా మహానటితో తన సత్తా చాటుకున్న కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో నటించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి అంటున్నారు.
సమంత కూడా ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మన్మథుడు 2’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పోర్చుగల్లో జరుగుతోంది. మనం ఎంటర్ప్రైజెస్, ఆనందీ ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ నిర్మిస్తున్నారు. దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.