కమలహాసన్ వివాదస్పద వ్యాఖ్యలు
BY Telugu Gateway13 May 2019 5:37 AM GMT

X
Telugu Gateway13 May 2019 5:37 AM GMT
సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన కమలహాసన్ హిందూ ఉగ్రవాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మొదటి ఉగ్రవాది నాధూ రామ్ గాడ్సే అని వ్యాఖ్యానించారు. మహాత్మగాంధీని హత్యచేసిన గాడ్సేతోనే దేశంలో ఉగ్రవాదం ఆరంభమైందని కమల్‌హాసన్ పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అరవక్కురిచ్చిలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అరక్కురిచ్చిలో ముస్లిం ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారని తాను ఈ వాఖ్యలు చేయడం లేదని వివరించారు. ఎక్కడైనా ఇదే మాట చెబుతానన్నారు. కమల్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు..పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
Next Story