‘కాజల్’ ఏకపక్ష ప్రేమ

కాజల్ అగర్వాల్. టాలీవుడ్ లో దశాబ్దానికి పైగా మెరుపులు మెరిపిస్తున్న భామ. అందరి లాగానే ఆమెకు పెళ్ళేప్పుడు..పెళ్లి తర్వాత నటిస్తారా? అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. అవి అడిగిన విలేకరులకు చిటపటలు కూడా అనుభవం అయ్యాయి?. ఈ ప్రశ్నలు కేవలం అమ్మాయిలనే ఎందుకు అడుగుతారు? అనే రివర్స్ పంచ్ లు కూడా చాలా మంది జర్నలిస్టులు చూశారు. తాజాగా కాజల్ తన ప్రేమ కథ గురించి బయట పెట్టింది. అది ఏంటో మీరూ చూడండి. నిజం చెప్పాలంటే నేనెప్పుడో ప్రేమలో పడ్డాను. ఎవరా లవర్? అసలు ఏంటీ ఈ ప్రేమ కథ అన్న టెన్షన్ ఉందా?. అంత టెన్షన్ అక్కర్లేదు.
అది వన్ సైడ్ లవ్ అంటూ ఝలక్ ఇఛ్చేసింది ఆ ఇంటర్వూ చేసిన వ్యక్తికి. నేను విపరీతంగా ప్రేమించింది ఎవరినో కాదు. క్రికెట్ క్రీడాకారుడు రోహిత్శర్మని. నాకు క్రికెట్ అంటే ఇష్టం. ఇక రోహిత్‌శర్మ క్రికెట్ ఆడే తీరు ఇంకా ఇష్టం. ఆయన బ్యాటింగ్ స్టైల్, ఫీల్డింగ్ ఎనర్జీ నచ్చుతాయట. అందుకే రోహిత్‌శర్మను ప్రేమించేశాను అని చెప్పింది. పెళ్ళి గురించి మాట్లాడితే మాత్రం కాజల్ అగర్వాల్ మాత్రం ఆ టైమ్ వచ్చినప్పుడు పెళ్లి జరుగుతుందనే వేదాంతాన్ని చెబుతంది ఈ భామ.