Telugu Gateway
Cinema

ఐస్ ముక్కల ‘కాజల్’

ఐస్ ముక్కల ‘కాజల్’
X

కాజల్ అగర్వాల్. దశాబ్దానికి పైగా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతున్న హీరోయిన్. మధ్యలో కాజల్ పనిపోయింది అన్నారు కానీ..ఆమె మాత్రం ఎక్కడా ఆగకుండా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతూనే ఉన్నారు. అంతే కాదు..టాప్ హీరోయిన్లకు ధీటుగా అవకాశాలు దక్కించుకుంటూ ఆశ్చరానికి గురిచేస్తున్నారు. కాజల్ కీలక పాత్రలో నటించిన ‘సీత’ సినిమా ఈ నెల24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సీత సినిమా కోసం చాలా కష్టాలు పడినట్లు చెప్పారు. స్వయంగా ఫైట్లు చేయటంతోపాటు..ఏకంగా 200 కిలోల ఐస్ ముక్కలను తనపై వేసుకుని నటించాల్సి వచ్చిందని వెల్లడించారు.

డాక్టర్ ను దగ్గర పెట్టుకుని ఫైట్లు చేయటంతోపాటు..ఈ ఐస్ ప్రయోగం చేసినట్లు తెలిపారు. కమల్ హాసన్ బిజీగా ఉన్నందున భారతీయుడు2 సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదని..జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. త్వరలోనే మరో కొత్త సినిమా విషయాలు వెల్లడిస్తానని తెలిపారు. తనకు నచ్చిన సినిమాలే తాను చేస్తాను తప్ప..ఎవరో చేస్తున్నారని తాను ఆ బాటలో పయనించనని స్పష్టం చేశారు.

Next Story
Share it